ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ జియోవీక్ భాగంగా ఈ బాలల దినోత్సవముకి మా మ్యాప్ బాక్స్ తరపున పాఠశాలకి వెళ్లి 6వ తరగతి విద్యార్థులకి జియోగ్రఫీ నేర్పించాలనుకున్నాం. నాగశెట్టి హళ్లి కన్నడ గవర్నమెంట్ పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించుకున్నాం. నవంబర్ 12వ తేదీన ఆ పాఠశాల యాజమాన్య అనుమతితో మూడు గంటల సేపు పిల్లలకి జియోగ్రఫీ గురుంచి ఆసక్తికరమైన విషయాలు నేర్పించాం.
ఖండాలు, మహా సముద్రాల పేర్లు , ప్రపంచ మరియు దేశ పటాలను చూపించి, వాటిలో నగరాలను గుర్తించడం వంటివి నేర్పించాం. పిల్లల చలాకీతనం, చురుకుతనం మమ్మల్ని ఎంతగానో అబ్బురపరిచింది. గ్లోబ్ యొక్క ప్రాముఖ్యతను, దిక్కులు వల్ల ఉపయోగాలను వివరించాం. వారికి ఇష్టమైన ప్రదేశాలను అడిగి వాటిని బోర్డు పై అతికించిన ప్రపంచం మరియు దేశ పటిమలో గుర్తించమని చెప్పాము.